పొలిటికల్ రిటైర్మెంట్‌పై నితిన్ గడ్కరీ క్లారిటీ

by Sathputhe Rajesh |
పొలిటికల్ రిటైర్మెంట్‌పై నితిన్ గడ్కరీ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. తాను పొలిటికల్ లైఫ్‌కు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. మహారాష్ట్రలోని ముంబై-గోవా జాతీయ రహదారి నెం.66పై ఏరియల్ సర్వే నిర్వహించిన గడ్కరీ ఈ సందర్భంగా తన విషయంలో వస్తున్న కథనాలపై స్పందించారు. తనకు రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకోవాలనే ఉద్దేశం లేదని చెప్పారు.

ఈ విషయంలో మీడియా రిపోర్టింగ్ బాధ్యతాయుతంగా ఉండాలని చురకలు అంటించారు. కాగా ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని భవిష్యత్‌లో భూసార పరిరక్షణ, వాతావరణ మార్పులకు సంబంధించిన పనులపై ఎక్కువ సమయం వెచ్చించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందువల్ల ప్రజలు ఓట్లు వేయకపోయినా పర్వాలేదని ఆశ్చర్యపరిచే వ్యాఖ్యలు చేశారు. దీంతో గడ్కరీ రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story