నీతి ఆయోగ్ నివేదిక ఫేక్: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

by samatah |
నీతి ఆయోగ్ నివేదిక ఫేక్: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని పేదరికంపై ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఆ నివేదిక ఒక బోగస్ అని అభివర్ణించారు. అంతేగాక నీతి ఆయోగ్ మోడీకి చీర్ లీడర్‌గా పని చేస్తోందని ఆరోపించారు. ‘నీతి ఆయోగ్ రిపోర్టు నమ్మశక్యంగా లేదు. దీనిని ఆర్థిక నిపుణులందరూ వ్యతిరేకిస్తున్నారు’ అని తెలిపారు. త్వరలోనే ఈ రిపోర్టుపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా, గత తొమ్మిదేళ్లలో దేశంలో 24.82కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించింది. అంతేగాక 2030కి ముందే భారత్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తుందని అంచనా వేసింది.

Advertisement

Next Story