Nithish kumar: బిహార్ సీఎం ఆఫీసుకు బాంబు బెదిరింపు.. కోల్‌కతాలో నిందితుడి అరెస్ట్

by vinod kumar |
Nithish kumar: బిహార్ సీఎం ఆఫీసుకు బాంబు బెదిరింపు.. కోల్‌కతాలో నిందితుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కార్యాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు ఈ మెయిల్ పంపిన వ్యక్తిని కోల్‌కతాలో అరెస్టు చేశారు. నిందితుడిని బిహార్‌లోని బెగూసరాయ్‌కు చెందిన జాహిద్‌గా గుర్తించారు. ఈ నెల 3వ తేదీన బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చి వేస్తామని ఈ మెయిల్ ద్వారా వార్నింగ్ వచ్చింది. ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా పేరుతో ఈ సమాచారం పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బౌబజార్ ప్రాంతంలో జాహిద్‌ను అరెస్టు చేశారు.

జాహిద్ కోల్‌కతాలో ఓ పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తు్న్నట్టు తెలిపారు. ఆయన వద్ద నుంచి ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అల్-ఖైదాతో సంబంధం ఉన్నట్లు ఈ మెయిల్‌లో పేర్కొన్నప్పటికీ, ఆ వ్యక్తికి ఏ ఉగ్రవాద గ్రూపుతోనూ సంబంధాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. రిమాండ్ పొందిన తర్వాత నిందితుడిని పాట్నాకు తీసుకు వచ్చి విచారించనున్నారు. అయితే ఈ మెయిల్ పంపడానికి గల కారణం తెలియరాలేదు. తన బంధువులను ఇరికించడానికే బెదిరింపు మెయిల్ పంపినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story