బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం.. స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మల

by Gantepaka Srikanth |   ( Updated:2024-07-30 12:24:33.0  )
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం.. స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మల
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించారని చేస్తోన్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు. అన్ని రాష్ట్రాలు కేంద్రానికి సమానమే అన్నారు. ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి వరుసగా మూడుసార్లు ప్రధాని కావడాన్ని కొందరు జీర్ణించుకోలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోటుమర్రి-విష్ణుపురం సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించామని తెలిపారు. భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రూ.770 కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు నిధులు, మొత్తంగా ఏపీ, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.1596 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. అంతేకాదు.. తెలంగాణ-మహారాష్ట్రలో రూ.4686 కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు నిధులు వెచ్చించామని అన్నారు. బడ్జెట్‌లో అసలు ఏ రాష్ట్రానికి కూడా వంచన జరుగలేదని తెలిపారు. కేరళలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.9,667 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

Advertisement

Next Story