- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చీర ప్రత్యేకత ఏంటంటే?
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ముందు వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికంటే ముందు నిర్మలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చారు. నీలం, క్రీం రగు టస్సార్ చీరను ధరించారు.
నిర్మలా సీతారామన్ ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే కన్పిస్తారు. భారతీయ వస్త్రాల పట్ల తనకున్న మక్కువకు ఆమె వస్త్రధారణ అద్దంపడుతుంది. గతేడాది కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి బహుకరించిన చీరను ధరించారు. నవలగుండ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఎరుపు రంగు ఇల్కల్ చీరను ధరించారు.
నిర్మలాకు క్రీమ్ కలర్ ఇష్టమైన రంగు. తరచూ ఆమె ఈ రంగునే ధరిస్తారు. 2022లో రస్టీ బ్రౌన్ బొమ్కయి చీరను ఎంచుకున్నారు. 2021లో ఎరుపు, తెలుపుతో ఉన్న పోచంపల్లిచీరను ధరించారు. 2020లో నీలం అంచుతో ఉన్న పసుపు రంగు చీరను ధరించారు. 2019లో గోల్డెన్ బార్డర్ తో కూడిన గులాభీ రంగు మంగళగిరి చీరలో కన్పించారు.
చేతితో నేసిన చీరలే కాకుండా.. బడ్జెట్ ప్రవేశపెట్టే రెడ్ బుక్ స్టైలిస్టిక్ గా ఉంటుంది. 2019లో తొలిసారి నిర్మలా బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు.. సంప్రదాయ బహీఖాటాను వాడారు. ఇవేకాకుండా 2021 నుంచి బడ్జెట్ పేపర్ లెస్ గా మారింది. రెడ్ కలర్ కవర్ లో ట్యాబ్ తీసుకువెల్లి.. బడ్జెట్ ను చదువుతుంది.
మోడీ ప్రభుత్వానికి రెండోసారి మధ్యంతర బడ్జెట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి చేరుకోగలదని.. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్ష నివేదిక పేర్కొంది. 2022-23లో 7.2 శాతం, 2021-22లో 8.7 శాతం వృద్ధి చెందింది.