Mamata Banerjee : మమతా బెనర్జీపై నిర్భయ తల్లి సీరియస్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-17 14:03:20.0  )
Mamata Banerjee :  మమతా బెనర్జీపై నిర్భయ తల్లి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిర్భయ తల్లి ఆశాదేవీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో నిందతులపై చర్యలు తీసుకోకుండా స్వయంగా సీఎం ధర్నాకు దిగడంపై ఆశాదేవీ మండిపడ్డారు. ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మమత ఇలా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. భారత దేశంలో మహిళలకు భద్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనతో అర్థమవుతోందని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆశాదేవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కాగా, కోల్‌కత్తాలో వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

Advertisement

Next Story