- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
NIA raids : బిహార్ బెంగాల్ సహా 6 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఆల్ ఖైదా కేసులో చర్యలు
దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా(Al-Quida)తో కలిసి దేశాన్ని అస్థిరపర్చేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. జమ్మూ కశ్మీర్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, బిహార్, త్రిపుర, అసోంలోని 9 ప్రాంతాల్లో సోమవారం ఏకకాలంలో తనిఖీలు చేసింది. అనుమానాస్పద వ్యక్తుల రహస్య స్థావరాల వద్ద సోదాలు నిర్వహించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యక్తులు అల్-ఖైదా కార్యకలాపాలకు మద్దతిస్తూ.. వారికి నిధులు సమకూరుస్తున్నారని ఆరోపణలున్నాయి. సోదాల్లో భాగంగా అధికారులు పలు కీలక పత్రాలు, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అనుమానిత వ్యక్తులు బంగ్లాదేశ్ ఆధారిత అల్-ఖైదా నెట్‌వర్క్‌కు మద్దతుదారులుగా ఉన్నట్టు ఎన్ఐఏ భావిస్తోంది. బంగ్లాదేశ్‌లో ఉన్న అల్-ఖైదా ఉగ్రవాదులు చేసిన కుట్రకు సంబంధించి 2023లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా దాడులు చేపట్టారు. గతేడాది నవంబర్‌లో ఇదే కేసులో ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.