BREAKING: రాష్ట్రంలో మరోసారి NIA దాడుల కలకలం.. ఏకకాలంలో 27 చోట్ల రైడ్స్

by Satheesh |   ( Updated:2024-02-10 03:42:01.0  )
BREAKING: రాష్ట్రంలో మరోసారి NIA దాడుల కలకలం.. ఏకకాలంలో 27 చోట్ల రైడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు కలకలం రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజూము నుండి రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరు, చెన్నై, తిరుచ్చి సహా 27 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. 2019 కోయంబత్తూరు కారు పేలుడు కేసుకు సంబంధించి కీలమైన సమాచారం మేరకు ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. సోదాల్లో భాగంగా అధికారులు కీలకమైన డేటా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, 2019 అక్టోబర్ నెలలో కోయంబత్తూరులో చోటు చేసుకున్న కారు బాంబ్ బ్లాస్ట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, పేలుడు సంభంచిన ఘటన స్థలంలో పోలీసులు గాజు పెంకులు, అల్యూమినియం మేకులు, బేరింగ్‌ బాల్స్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ బ్లాస్ట్ వెనుక టెర్రరిస్ట్‌లు ప్రమేయం ఉందన్న అనుమానం రావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ పర్యవేక్షిస్తోంది.

Advertisement

Next Story