న్యూస్ క్లిక్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడి ఇంట్లో సీబీఐ దాడులు

by Javid Pasha |   ( Updated:2023-10-11 06:49:17.0  )
న్యూస్ క్లిక్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడి ఇంట్లో సీబీఐ దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్‌ సమస్యల్లో చిక్కుకుంది. చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలతో న్యూస్ క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థను ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందాయనే ఆరోపణలతో సీబీఐ కూడా రంగంలోకి దిగింది. న్యూస్ క్లిక్‌పై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం నుంచి న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ ఇళ్లు, ఆఫీస్‌లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

ఏకకాలంలో ప్రబీర్ ఇళ్లు, ఆఫీస్‌లో తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రబీర్ ఇల్లు, ఆఫీస్‌తో పాటు న్యూస్ క్లిక్ పోర్టల్‌లో పనిచేసే సీనియర్ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేపట్టారు. ప్రబీర్‌తో పాటు హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. నిధులు వ్యవహారం గురించి వారిని ప్రశ్నిస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు న్యూస్ క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రబీర్‌పై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉండటంతో సీబీఐ కూడా రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దీంతో న్యూస్ క్లిక్‌కు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed