చైనా ప్రభుత్వం వింత పోకడ.. కిస్సులు, హగ్గులు వద్దంటూ నిబంధనలు

by Sathputhe Rajesh |
చైనా ప్రభుత్వం వింత పోకడ.. కిస్సులు, హగ్గులు వద్దంటూ నిబంధనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చైనాలో మరోసారి కోరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో భారీ ఎత్తున కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. డ్రోన్ల ద్వారా ప్రచారం చేస్తూ అందరినీ అలర్ట్ చేస్తుంది. జీరో కొవిడ్ పాలసీ అంటూ ఇప్పటికే లాక్‌డౌన్ విధించి పెద్దఎత్తున పరీక్షలు చేస్తోంది. అయితే, ప్రభుత్వం కొన్ని వింత ఆంక్షలు విధించడంతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆంక్షలేంటో తెలుసా,? కలిసి తినొద్దు.. జంటగా నిద్రించొద్దు.. ముద్దులు, కౌగిలింతలు అసలే వద్దు అని షాంఘైలో డ్రోన్లతో పాటు వైద్య సిబ్బందితో మైకుల్లో హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా, కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు కాస్త ఉపశమనం కోసం బాల్కనీలోకి వచ్చినా డ్రోన్లు ప్రత్యక్షమై లోపలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story