నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీయే విఫలం

by John Kora |   ( Updated:2025-02-03 13:50:58.0  )
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీయే విఫలం
X

- యువతకు సరైన పరిష్కారం చూపించలేదు

- యువతకు జవాబుదారీగా ఉండాలి

- 'మేకిన్ ఇండియా'లో మోడీ విఫలమయ్యారు

- తయారీ రంగంలో చైనా దూసుకొని పోతుంది

- లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

దిశ, నేషనల్ బ్యూరో:

దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను అధిగమించే విషయంలో అప్పటి యూపీయే ప్రభుత్వం కానీ.. ఇప్పుడున్న ఎన్డీయే గవర్నమెంట్ కానీ సరైన పరిష్కారం చూపలేకపోయాయి. ఉగ్యోగాల విషయంలో దేశ యువతకు సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సోమవారం లోక్‌సభలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు. ఆమె ప్రసంగం గతం ఇచ్చిన స్పీచ్‌లకు ఏ మాత్రం తేడా కనిపించలేదని విమర్శించారు. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉంది. మనం ఏం మాట్లాడినా వారికి జవాబుదారీగా ఉండాలని రాహుల్ చెప్పారు. ఈ సభలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ అంశాన్ని ప్రధాని మోడీతో సహా అందరూ అంగీకరిస్తారు. అదేంటంటే మనం అభివృద్ధి చెందాం.. చాలా వేగంగా అభివృద్ధి చెందాం.. ఇప్పుడు అభివృద్ధి కొంత నెమ్మదించినా.. అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. కానీ మన దేశంలో అతిపెద్ద సమస్య అయిన నిరుద్యోగాన్ని మాత్రం సరిగా అధిగమించలేకపోయాం. ఈ విషయంలో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన 'మేకిన్ ఇండియా' కార్యక్రమం చాలా మంచి ఆలోచన. కానీ దాన్ని అమలు చేయడంలో ప్రధాని విఫలమయ్యారని రాహుల్ గాంధీ విమర్శించారు. జీడీపీలో తయారీ రంగం వాటా 2014లో 15.3 శాతం ఉంటే.. ఇప్పుడు అది 12.6 శాతానికి పడిపోయింది. గత 60 ఏళ్లలో జీడీపీలో తయారీ రంగం వాటా ఇదే అత్యల్పం. ఈ విషయంలో ప్రధాని మోడీని నేను నిందించడం లేదు. ఆయన ఈ రంగం అభివృద్ధికి ప్రయత్నించారు. కానీ ఫెయిల్ అయ్యారని రాహుల్ చెప్పారు. నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పరిష్కరించగలమని మనం ముందుగా యువతకు చెప్పాలి. 1990 నుంచి ప్రతీ ప్రభుత్వం వినియోగం ఎక్కువ శ్రద్ధ పెట్టింది. దీంతో మనం ఉత్పత్తి పరంగా ఫెయిల్ అయ్యామని రాహుల్ చెప్పారు.

తయారీ రంగాన్ని మనం తీసుకెళ్లి చైనా చేతుల్లో పెట్టాము. ఉత్పత్తి రంగంలో మనం నిలదొక్కుకోక పోవడం వల్లే చైనా ఇప్పుడు మన మార్కెట్‌లో మకాం వేసిందని రాహుల్ చెప్పారు. ఇప్పటికైనా మనం తయారీ రంగంపై పూర్తి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాహుల్ చెప్పారు. దేశంలో సాఫ్ట్‌వేర్ విప్లవంపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగంపై మనకు దృష్టి ఉంది. ఇది రాబోయే రోజుల్లో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని రాహుల్ చెప్పారు. మన దగ్గర డేటా లేకుండా ఏఐని అభివృద్ధి చేస్తామనడం అర్థం లేనిదని అన్నారు. ఉత్పత్తి రంగం నుంచే ప్రపంచానికి డేటా అనేది వస్తుంది. ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ఉపయోగించే డేటా చైనా చేతుల్లో ఉంది. ఇక అమెరికా వినియోగించే డేటాను కలిగి ఉంది. చైనాలో కూడా వినియోగదారుల డేటా వారి దగ్గరే ఉంది. కానీ ఇండియాకు సంబంధించిన డేటా అంతా గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి కంపెనీల చేతుల్లో ఉందని రాహుల్ చెప్పారు. మన దగ్గర డేటాలే లేనప్పుడు ఏఐని ఎలా అభివృద్ధి చేస్తారని రాహుల్ ప్రశ్నించారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించేలా చూడటానికే గతేడాది విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటన చేపట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక వేళ మనం తయరీ, ఏఐ రంగాల్లో అగ్రగామిగా ఉండుంటే అమెరికా అధ్యక్షుడే ఇక్కడకు వచ్చి ప్రధానిని ఆహ్వానించేవారని రాహుల్ తెలిపారు.

Next Story

Most Viewed