నీట్ యూజీ వివాదం.. రేపు సుప్రీంకోర్టులో విచారణ

by vinod kumar |
నీట్ యూజీ వివాదం.. రేపు సుప్రీంకోర్టులో విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది మే 5న నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిందనే ఆరోపణలు రావడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షను రద్దు చేయాలని కొందరు, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం అత్యన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. మొత్తం ఈ అంశంపై 38 పిటిషన్లు దాఖలు కాగా..ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వీటన్నింటిపై విచారణ చేపట్టనుంది.

అయితే పరీక్ష రద్దు చేయడం సరికాదని కేంద్ర ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఎగ్జామ్ లో భారీ అవకతవకలు ఏం జరగలేదని స్పష్టం చేసింది. పరీక్షను రద్దు చేస్తే నిజాయితీ గల అభ్యర్థులకు నష్టం జరుగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కాగా, నీట్ యూజీ కౌన్సెలింగ్ ను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీయూఈటీ యూజీ పరీక్ష ఆన్సర్ కీని ఎన్టీఏ రిలీజ్ చేసింది. త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపింది.

Advertisement

Next Story