NEET (UG)-2024: నీట్ యూజీపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. తీర్పు కోసం లక్షల్లో అభ్యర్థుల ఎదురుచూపులు

by Shiva |
NEET (UG)-2024: నీట్ యూజీపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. తీర్పు కోసం లక్షల్లో అభ్యర్థుల ఎదురుచూపులు
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్-యూజీ పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లు నేడు విచారణకు రానున్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ పిటిషన్లపై సమగ్ర విచారణ జరపనుంది. అయితే, కోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సెంటర్ల వారీగా విడుదల చేసింది. పరీక్ష రద్దు చేయాలని కోరుతూ.. 38 పిటిషన్లు దాఖలు అయ్యాయి. అదేవిధంగా పలు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు హైకోర్టుకు బదిలీ చేయాలని కోరిన ఎన్టీఏ రెండు పిటిషన్లపైనా సుప్రీం విచారణ చేపట్టనుంది.

కాగా, ఎన్‌టీఏ విడుదల చేసిన రిపోర్టులో పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలతో లబ్ధి పొందిన అభ్యర్థులు ఎవరూ పెద్దగా రాణించలేదని తేల్చింది. 4,750 కేంద్రాలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థుల డేటాను కలిపి కాకుండా సెంటర్ల వారీగా ఫలితాలను విడుదల చేశారు. లక్షలాది మంది అభ్యర్థులు పరీక్ష భవితవ్యంపై సుప్రీం కోర్టుల తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై పలు పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌టీఏ అధికారులు డేటాను విడుదల చేశారు.

Advertisement

Next Story