- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NEET PG : ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష.. హాజరైన 2,28,540 మంది అభ్యర్థులు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : నీట్ పీజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా 170 నగరాల్లోని 416 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,28,540 మంది పరీక్ష రాశారు. ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ జరిగింది. 1950 మంది స్వతంత్ర పరిశీలకులు, 300 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయించారు.
నీట్ పీజీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) నిర్వహించింది. పరీక్ష పర్యవేక్షణకు ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఉన్న ఎన్‌బీఈఎంఎస్ కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా దేశవ్యాప్తంగా మరో 8 చోట్ల కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ జరుగుతున్న క్రమంలో వదంతులు వ్యాపించకుండా ఆయా కమాండ్ సెంటర్ల నుంచి సోషల్ మీడియాను మానిటర్ చేశారు.
Advertisement
Next Story