- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట్ పేపర్ లీక్ కేసు..నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పేపర్ లీక్ దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో తాజాగా పాట్నాలోని ఎయిమ్స్‌కు చెందిన నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులను అరెస్ట్ చేసింది. వారిలో చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షాలు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువు తుండగా..మరొక విద్యార్థి కరణ్ జైన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు గుర్తించారు. వీరిని వారి హాస్టల్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విద్యార్థులందరినీ విచారించిన సీబీఐ కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. స్టూడెంట్స్ హాస్టల్ గదిని సైతం సీబీఐ సీజ్ చేసింది. వారి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఎయిమ్స్ పాట్నా డైరెక్టర్ జేకే పాల్ ఈ వ్యవహారాన్నీ ధ్రువీకరించారు. నలుగురు విద్యార్థులను సీబీఐ తీసుకువెళ్లిందని తెలిపారు. ఎయిమ్స్ సీనియర్ మేనేజ్‌మెంట్ సమక్షంలో వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీబీఐకి సహకరిస్తామని వెల్లడించారు. అయితే విద్యార్థులకు పేపర్ లీక్‌కు ఎక్కడ సంబంధం ఉందన్న విషయంపై స్పష్టత రాలేదు.