Neet exam: నీట్ పరీక్షను రద్దు చేయాలి..బీఎస్పీ చీఫ్ మాయవతి

by vinod kumar |
Neet exam: నీట్ పరీక్షను రద్దు చేయాలి..బీఎస్పీ చీఫ్ మాయవతి
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి స్పందించారు. నీట్ పరీక్షను రద్దు చేసి మెడికల్ అడ్మిషన్లలో పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నీట్ యూజీలో జరిగిన అవకతవకలు తీవ్రమైన సమస్య. ఫలితం ఏమైనప్పటికీ, లక్షలాది మంది అభ్యర్థులు వారి కుటుంబాలకు కలిగిన బాధ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇంత ముఖ్యమైన పరీక్షను సక్రమంగా నిర్వహించగలమని ప్రజలకు హామీ ఇవ్వడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. కాబట్టి నీట్ పరీక్షను రద్దు చేసి పాత విధానాన్ని ఎందుకు పునరుద్ధరించకూడదని ప్రశ్నించారు. కాగా, నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశ వ్యాప్తంగా దుమారం రేపగా..సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed