- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో ఆ పార్టీదే అధికారం.. ఎన్‌డీటీవీ సర్వేలో కీలక విషయాలు!
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో మే 10న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యలో కర్ణాటకలో ఏ పార్టీ గెలుస్తుందోనని పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తు్న్నాయి. ఇందులో భాగంగా పలు అంశాలపై సీఎస్‌డీఎస్, ఎన్‌డీటీవీలు ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. రాజకీయ ప్రాధాన్యత, కర్ణాటక అభివృద్ధికి మేలు, మత సామరస్యాన్ని కాపాడే పార్టీ, బొమ్మై సర్కార్ పని తీరు వంటి అంశాలపై ప్రజాభిప్రాయం తెలుసుకున్నాయి. పేద, దిగువ మధ్య తరగతి, రిచ్ వంటి ప్రజల నుంచి అభిప్రాయసేకరణ చేపట్టాయి.
అయితే కర్ణాటక ప్రజల అభిప్రాయాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఈ రిపోర్టును కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాజకీయ ప్రాధాన్యతపై పేదల నుంచి అభిప్రాయం సేకరించగా కాంగ్రెస్- 50%, బీజేపీ-23%గా వచ్చింది. కర్ణాటక అభివృద్ధికి మేలు చేసే పార్టీ ఏది అనే అంశంపై కాంగ్రెస్- 47%, బీజేపీ-37%, JDS-14% మంది అభిప్రాయం తెలిపారు.
మత సామరస్యాన్ని కాపాడే పార్టీ అని అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్- 49%, బీజేపీ-34%, JDS-14% మంది తమ అభిప్రాయాలను పేర్కొన్నారు. ఇక బొమ్మై సర్కార్ పని తీరు పట్ల పేదలు 67 శాంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగువ మధ్య తరగతి ప్రజలు 58 శాతం వ్యతిరేకించారు. బొమ్మై సర్కార్‌కు వ్యతిరేకంగా 52 శాతం మధ్య తరగతి, 49 శాతం మంది రిచ్ పీపుల్స్ తమ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే ఈ రిపోర్టు అంతా తప్పు అని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్నికల అనంతరం ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.