Farooq Abdullah : ఎన్నికల్లో పోటీపై ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా సంచలన నిర్ణయం

by Hajipasha |
Farooq Abdullah : ఎన్నికల్లో పోటీపై ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. అయితే ఒమర్ అబ్దుల్లా ఈసారి పోటీ చేయరని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా మంజూరు కాగానే తాను రాజీనామా చేస్తానని, అనంతరం తన సీటు నుంచే ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తారని ఆయన తెలిపారు.ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి సరిగ్గా 24 గంటల ముందు కశ్మీర్ పాలనా యంత్రాంగంలో జరిగిన భారీ బదిలీలపై విచారణ జరగాలని ఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.

‘‘కొంతమంది అధికారులను అకస్మాత్తుగా బదిలీ చేశారు. బీజేపీకి చెందిన బీ టీమ్స్, సీ టీమ్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఈ బదిలీలు చేసి ఉంటారనేది మా అనుమానం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా,2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. నియోజకవర్గాల పునర్విభజనతో కశ్మీర్‌లో శాసనసభ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది.

Advertisement

Next Story