నన్నేమైనా అను.. నాన్ననంటే ఊరుకోను: అజిత్ పవార్ కు సుప్రియా సూలే వార్నింగ్

by Javid Pasha |   ( Updated:2023-07-05 11:05:54.0  )
నన్నేమైనా అను.. నాన్ననంటే ఊరుకోను: అజిత్ పవార్ కు సుప్రియా సూలే వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పై మండిపడ్డారు. తననేమన్న పడుతానని.. కానీ నాన్న (శరద్ పవార్)ను ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవినీతితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ పోరాటం చేస్తున్నారని అన్నారు. ఎన్సీపీ అంటే నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ అని ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ కాదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రబుత్వం ప్రతిపక్షాలపై ఐస్ (ICE)ను ప్రయోగిస్తోందని చెప్పారు. ఐ అంటే ఐటీ, సీ అంటే సీబీఐ, ఈ అంటే ఈడీ అని ఆమె కొత్త నిర్వచనమిచ్చారు.

పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు పోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంలేదని, ప్రజలు తమ వైపే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఎన్సీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను తిరిగి తీసుకురావడం ఎలాగో తనకు తెలుసునని అన్నారు. కాగా ఎన్సీపీ సింబల్, పార్టీ తమదంటే తమదంటూ అటు అజిత్ పవార్ వర్గం, ఇటు శరద్ పవార్ వర్గం ఈసీకి దరఖాస్తు చేసుకున్నాయి.

Read More..

ఎన్సీపీ సింబల్, పార్టీ కోసం ఈసీని ఆశ్రయించిన అజిత్ పవార్

Advertisement

Next Story

Most Viewed