Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ

by Shamantha N |
Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అందరూ ఊహించినట్లే హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీ నమోదు చేసింది. అయితే, సీఎంగా ఎవర్ని నియమించాలనే దానిపై బుధవారం కమలం పార్టీ శ్రేణులు చర్చలు జరిపాయి. పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చిన నాయబ్ సింగ్ వైపే అధిష్ఠానం ఆసక్తి కనబర్చింది. బుధవారం జరిగిన శాసనసభా పక్ష భేటీలో ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నకుంది. ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ హాజరయ్యారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ సైనీ పేరుని ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో, గురువారం హర్యానా సీఎంగా సైనీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రమాణ స్వీకారానికి మోడీ హాజరు

గురువారం జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో హర్యానా సీఎంగా ఈ ఏడాది మార్చిలో సైనీ బాధ్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డారు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడ్డాయి. బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది.

Advertisement

Next Story

Most Viewed