- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మోడీ మిత్రుల వద్దే దేశ సంపద: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని మొత్తం సంపదను ప్రధాని నరేంద్ర మోడీ నలుగురైదుగురు ధనవంతులకు మాత్రమే పంచి పెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గంలో ఆదివారం తన సోదరుడు రాహుల్ గాంధీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. మోడీ గత పదేళ్లుగా వారణాసి ఎంపీగా ఉన్నారని, కానీ ఆ నియోజకవర్గంలోని ఏ గ్రామాన్నీ కూడా ఇప్పటి వరకు సందర్శించలేదని ఆరోపించారు.
దేశ సంపద మొత్తాన్ని నలుగురైదుగురు ధనవంతులకు మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. దేశంలోని బొగ్గు, విద్యుత్, ఓడరేవులు, విమానాశ్రయాలు అన్నీ ప్రధాని మిత్రుల వద్దే ఉన్నాయని చెప్పారు. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీలు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని గుర్తు చేశారు. కానీ మోడీ మాత్రం బడా పారిశ్రామిక వేత్తలను చూసి పెద్ద ఈవెంట్లు నిర్వహిస్తారని, మోడీకి పేదవారు కనపడరని ఎద్దేవా చేశారు.