35.7 లక్షల ఖాళీలు.. ఎన్‌సిఎస్ పోర్టల్ జాబితా విడుదల చేసిన కేంద్రం

by Vinod kumar |
35.7 లక్షల ఖాళీలు.. ఎన్‌సిఎస్ పోర్టల్ జాబితా విడుదల చేసిన కేంద్రం
X

న్యూఢిల్లీ: నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సిఎస్)లో 2022-23కుగాను 35.7 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఎన్‌సీఎస్ పోర్టల్ జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు అని మంత్రిత్త శాఖ పేర్కొంది. నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్‌ను మిషన్ మోడ్ ప్రాజెక్ట్ పేరుతో కార్మిక, ఉపాధి మంత్రిత్త శాఖ నిర్వహిస్తోంది. జాబ్ మ్యాచింగ్, కెరీర్ కౌన్సిలింగ్, వొకేషనల్ గైడెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులపై సమాచారం, ఇంటర్న్‌షిప్ వంటి ఉపాధి సంబంధిత సేవలను నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్ అందిస్తోంది. ఎన్‌సిఎస్ సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

2015లో ప్రధానమంత్రి దీనిని జాతికి అంకితం చేశారు. ఎన్‌సిఎస్ పోర్టల్ 2015 జూలైలో ప్రారంభించినప్పటి నుంచి 2022-2023లో అత్యధిక ఖాళీలను నమోదు చేసిందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2021-22లో 13 లక్షల ఖాళీలు ఉండగా.. 2022-23లో 35.7 లక్షల ఖాళీలు ఉన్నాయని ఎన్‌సిఎస్ అధికారులు తెలిపారు. అంటే 2021-22తో పోలిస్తే 2022-23లో ఖాళీల సంఖ్య 175 శాతం పెరిగింది. వ్యాపార వ్యవహారాలు, సహాయక రంగాల్లోని ఖాళీలు కూడా 400 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2021-22లో 76 వేల ఖాళీలు ఉండగా.. 2022-23లో అది 3.75 లక్షలకు పెరిగింది. హోటల్స్, ఫుడ్ సర్వీస్, క్యాటరింగ్, తయారీ, ఆరోగ్యం, విద్య వంటి ఇతర రంగాల్లో కూడా ఖాళీలు గణనీయంగా పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed