ఓబీసీలకు ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర మంత్రి డిమాండ్

by S Gopi |
ఓబీసీలకు ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర మంత్రి డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలుపుతూ కర్ణాటక ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రి రాందాస్ అథవాలే బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఓబీసీలు లేదా ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని తమ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల నుంచి చాలామంది(ప్రైవేట్ రంగంలో) ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి రిజర్వేషన్ లేదు. త్వరలో ప్రభుత్వం రంగ సంస్థలు కూడా ప్రైవేట్‌గా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను తమ పార్టీ తరపున కోరుతున్నాం. అయితే, మేము జనరల్ కేటగిరీ అభ్యర్థులను వ్యతిరేకించడంలేదని, ఓబీసీలకు అవకాశాలు కల్పించాలని ఆయన వివరించారు. బుధవారం కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో గ్రూప్‌ సి, డి గ్రేడ్‌ పోస్టుల్లో స్థానికులకే 100 రిజర్వేషన్ ఇవ్వాలనే బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే, ఆ తర్వాత వివిధ వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో నాన్-మేనేజ్‌మెంట్ కోటా ఉద్యోగాల్లో 70 శాతం, మేనేజ్‌మెంట్ స్థాయిలో 50 శాతం కన్నడిగులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed