- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమ నేత మనోజ్ జరాంగేకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండె వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో: దేవెంద్ర ఫడ్నవిస్‌పై సంచలన ఆరోపణలు చేసిన కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగేపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఇదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రేలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదే పదే నిరసనలు చేస్తున్న వారు మా సహనాన్ని పరీక్షించకూడదు. వారు శాంతిభద్రతల సమస్యలను సృష్టించకూడదు. జరాంగే ప్రసంగం సాధారణంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు ఉపయోగించే స్క్రిప్ట్‌ల ఎందుకు ఉందో ఆశ్చర్యంగా ఉందని ' షిండే సందేహం వ్యక్తం చేశారు. జరాంగే దూకుడు వైఖరి, అతని ప్రసంగం తీరు గురించి అడిగినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని షిండే బదులిచ్చారు. ఇదంతా ఓ కుట్రలా ఉంది. త్వరలో అన్ని బట్టబయలు అవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర సీఎం వ్యాఖ్యలకు ముందు ఫడ్నవీస్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి సరైన దిశగానే ఆలోచిస్తుందని, అవసరమైన సమయంలో వివరాలు బయటకు వస్తాయని ఫడ్నవీస్ అన్నారు. కాగా, కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనను చంపాలనుకుంటున్నాడని, ముంబైలో ఆయన నివాసానికి కాలి నడకన వెళ్లి ఇంటిముందు నిరసన తెలియజేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంసమైంది.