President Murmu: కోర్టుల్లో 'వాయిదాల సంస్కృతి'ని మార్చే ప్రయత్నాలు జరగాలి

by S Gopi |
President Murmu: కోర్టుల్లో వాయిదాల సంస్కృతిని మార్చే ప్రయత్నాలు జరగాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: సత్వరం న్యాయం జరిగేందుకు న్యాయస్థానాల్లో 'వాయిదాల సంస్కృతి 'ని మార్చే ప్రయత్నాలు జరగాలని, అందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆదివారం రెండు రోజుల జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సులో ప్రసంగించిన ముర్ము.. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటం అతిపెద్ద సవాలుగా ఉందని, న్యాయాన్ని రక్షించే బాధ్యత దేశంలోని న్యాయమూర్తులందరిపై ఉంటుందన్నారు. 'కోర్టులలో జరిగే ప్రక్రియ సామాన్యులపై ఒత్తిడిని పెంచుతుంది. దీన్ని 'బ్లాక్ కోట్ సిండ్రోమ్'గా భావించవచ్చని, దీనిపై అధ్యయనం జరగాలని సూచించారు. ఇదే సమయంలో కోర్టుల్లో 'వాయిదాల సంస్కృతి 'ని మార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. న్యాయాన్ని రక్షించడానికి అందరూ బాధ్యతగా భావించాలని ' వివరించారు. ఇదే సమయంలో కోర్టుల్లో మహిళా జ్యూడీషియల్ ఆఫీసర్ల సంఖ్య పెరగడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ, న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాగ్లొన్నారు.

Advertisement

Next Story