- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మా హిందుత్వానికే ముస్లింల సపోర్ట్ : ఉద్ధవ్ థాక్రే
దిశ, నేషనల్ బ్యూరో : ముస్లిం ఓటర్లను ఉద్దేశించి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తమ ఇళ్లను తగలబెట్టే బీజేపీని ముస్లింలు అస్సలు నమ్మరు. వాళ్ల ఇళ్లలో వంట పొయ్యిలను వెలిగించే మా పార్టీకే ముస్లింలు అండగా నిలుస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ముంబైలో శివసేన కార్యకర్తలను ఉద్దేశించి థాక్రే మాట్లాడారు. ‘‘ముస్లిం సమాజం మా వెంటే నడుస్తోంది. నేను బాలాసాహెబ్ థాక్రే కుమారుడినని, కరుడుగట్టిన హిందువునని తెలిసినా ముస్లింలు ఆదరిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అనుసరించే హిందుత్వం వేరు.. మేం అనుసరించే హిందుత్వం వేరు’’ అని తెలిపారు. ‘‘ఇంతకుముందు ఎంతమందికి భారతరత్న అవార్డులు ఇవ్వాలి ? ఎవరికి ఇవ్వాలి ? ఎప్పుడు ఇవ్వాలి ? అనే నిబంధనలు ఉండేవి. ఇప్పుడలా లేదు. ప్రధాని మోడీ మనసులో ఉన్న వాళ్లందరికీ భారతరత్న ఇచ్చేస్తున్నారు’’ అని ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. ‘‘బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై మేం కూడా సంతోషంగానే ఉన్నాం. అయితే బిహార్‌లో ఓట్ల కోసం, రాజకీయాల కోసం భారతరత్న అవార్డును వాడుకున్న తీరును గుర్తు చేసుకుంటేనే బాధగా అనిపిస్తోంది’’ అని ఆయన కామెంట్ చేశారు.