- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 245 కోట్ల విలువైన మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ముంబై పోలీసులు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ద్రాక్ష తోట పరిసరాల్లో ఉన్న మెఫెడ్రోన్ తయారీ కర్మాగారాని ముంబై పోలీసులు ఛేదించారు. రూ. 245 కోట్ల విలువైన క్వింటా మత్తు పదార్థాన్ని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు బుధవారం ఓ అధికారి తెలిపారు. గత నెలలో ముంబైలో రూ. 7 కోట్ల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చేపట్టిన విచారణ ఆధారంగా తాజా దాడిలో మెఫెడ్రోన్ తయారు చేసే ప్రవీణ్ షిండేతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజా పట్టివేత గురించి మాట్లాడిన పోలీసులు.. జిల్లాలోని ఇరాలి గ్రామంలో ఓ పొలంలో దాడులు నిర్వహించి 122.5 కిలోల మెఫెడ్రోన్, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో ఇప్పటివరకు రూ. 252 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడు షిండే తన సహాయకులతో కలిసి ఇరాలి గ్రామంలో ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి మెఫెడ్రోన్ ఉత్పత్తిలో శిక్షణ కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లినట్టు అధికారి తెలిపారు. నిందితులు గ్రామంలోని 12 ఎకరాల భూమిని, దాని చుట్టూ ద్రాక్ష తోటలను కొనుగోలు చేశారు. షిండే తాను తయారు చేసిన డ్రగ్స్‌ను కిలోకు రూ. లక్ష సంపాదించాడని, ఈ సిండికేట్‌తో ప్రమేయం ఉన్న మరికొందరి ఆచూకీ కోసం దర్యాప్తును ముమ్మరం చేసినట్టు పోలీసులు వెల్లడించారు.