10 రోజుల్లో రాజీనామా చేయకపోతే సీఎంను చంపేస్తాం.. పోలీసులకు బెదిరింపు మెసేజ్

by Rani Yarlagadda |
10 రోజుల్లో రాజీనామా చేయకపోతే సీఎంను చంపేస్తాం.. పోలీసులకు బెదిరింపు మెసేజ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు, ప్రముఖలను చంపేస్తామన్న బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. విమానాలు, స్కూళ్లు, హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. మరోవైపు సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులను చంపేస్తామని బెదిరిస్తున్నారు. తాజాగా ముంబై పోలీసులకు మరో బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi Adityanath)ను చంపేస్తామని దాని సారాంశం. యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయకపోతే .. ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ (Baba Siddique)ని చంపినట్లే చంపేస్తామని ఆగంతకులు ఆ మెసేజ్ లో పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం ముంబై పోలీస్ (Mumbai Police) ట్రాఫిక్ కంట్రోల్ సెల్ కు పేరు తెలియని నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఆ మెసేజ్ ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది ? బాబా సిద్ధిఖీని చంపినవారే ఈ మెసేజ్ పంపారా ? అనే కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. బాబా సిద్ధిఖీ అక్టోబర్ 12న తన కొడుకు జీషాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique) ఆఫీస్ వద్ద ఉండగా.. ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు వచ్చిన మర్నాడే ఈ హత్య జరగడం కలకలం రేపింది. సల్మాన్ ఖాన్ ను బెదిరించింది నోయిడాకు చెందిన ఓ కూరగాయల వ్యాపారి అని తెలియడంతో.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story