ముంబై హోర్డింగ్ ఘటన: మరో రెండు మృత దేహాల వెలికితీత

by samatah |
ముంబై హోర్డింగ్ ఘటన: మరో రెండు మృత దేహాల వెలికితీత
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని ఘాట్‌కోపర్‌లో హోర్డింగ్ కూలిన ఘటనలో గురువారం వరుసగా నాలుగో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మరో రెండు మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. ఈ మృతదేహాలను రిటైర్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ మనోజ్ ఛన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు. మనోజ్ మార్చిలోనే ముంబై ఏటీసీ జనరల్ మేనేజర్ పదవి నుంచి పదవీ విరమణ చేశారు. అయితే అనంతరం ఆయన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నివసముంటున్నాడు. తన భార్య అనిత వీసా పని కోసం తన కారులో ముంబైకి వెళ్ళినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు 89 మందికి వెలికితీయగా అందులో 16 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ముంబైని తాకిన భారీ దుమ్ము తుఫాను కారణంగా సోమవారం 250 టన్నుల హోర్డింగ్ కూలిపోయిన విషయం తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా నాలుగో రోజు బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రానీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించడంతోపాటు గాయపడిన వారి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed