- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Baba Siddique : బాబా సిద్ధిఖీ హత్య నిందితుడికి రిమాండ్
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను ముంబయిలోని ఎస్‌ప్లనేడ్ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్‌కు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హర్యానాకు చెందిన గుర్మెల్ సింగ్‌ను ఈ నెల 21వ తేదీ వరకు పోలీసు కస్టడీలో ఉంచడానికి అనుమతించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌ను కూడా కోర్టులో హాజరుపరచగా.. తాను మైనర్‌ను అని నిందితుడు వాదించారు. కశ్యప్‌కు మోన్ ఆసిఫికేషన్ టెస్టు నిర్వహించి మైనరేనా? కాదా? అనేది తేల్చాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. టెస్టు చేసిన తర్వాత మరోసారి కోర్టులో కశ్యప్‌ను హాజరుపరచాలని, అప్పుడు కస్టడీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మైనర్ అయితే జువెన్ల కోర్టు విచారణకు పంపిస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
కాగా, అందులో ఒక నిందితుడు తాను మైనర్‌ను వాదించాడు. దీంతో కోర్టు ఒకరికి ఈ నెల 21వ తేదీ వరకు పోలీసు రిమాండ్‌కు అనుమతించగా.. మరో నిందితుడు మైనరేనా? కాదా? అనేది తేల్చి మరోసారి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం కొనసాగిన బాబా సిద్ధిఖీ కొన్ని నెలల కిందే ఎన్సీపీలో చేరాడు. సిద్ధిఖీ కొడుకు జీషన్ సిద్ధిఖీ ఎమ్మెల్యే. బాంద్రాలోని ఈ ఎమ్మెల్యే ఆఫీసు ఎదుటే ముగ్గురు నిందితులు కాల్చి చంపారు.