Mpox Case : మంకీపాక్స్ కేసును నిర్ధారించిన భారత్.. అది ప్రాణాంతక వేరియంట్ కాదని స్పష్టీకరణ

by Hajipasha |
Mpox Case : మంకీపాక్స్ కేసును నిర్ధారించిన భారత్.. అది ప్రాణాంతక వేరియంట్ కాదని స్పష్టీకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో ఒక మంకీపాక్స్ కేసు బయటపడిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ధారించింది. అయితే అది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతున్న ప్రమాదకర మంకీపాక్స్ వేరియంట్ కాదని స్పష్టం చేసింది. మంకీపాక్స్ వేగంగా ప్రబలుతున్న ఓ దేశం నుంచి భారత్‌కు వచ్చిన ఒక వ్యక్తిలో ఆ వ్యాధి లక్షణాలను గుర్తించారు.

దీంతో అతడిని ఐసోలేట్ చేసి, ఓ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. 2022 సంవత్సరం జులై నుంచి ఇప్పటివరకు భారత్‌లో నిర్ధారణ అయిన 30 మంకీపాక్స్ కేసుల తరహా వేరియంట్‌ వల్లే సదరు వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడైంది. డబ్ల్యూహెచ్ఓ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి కారణమైన వేరియంట్ వల్ల అతడికి మంకీపాక్స్ సోకలేదని కేంద్ర సర్కారు స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed