- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెక్స్ స్కాండల్ కేస్: ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన MP ప్రజ్వల్ రేవణ్ణ
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు కర్నాటక రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మనువడు, ఎంపీ అయిన ప్రజ్వల్ రేవణ్ణ వందలాది మంది మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసి వీడియోలు చిత్రీకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. రేవణ్ణ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సిద్ధరామయ్య ప్రభుత్వం.. కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. దీంతో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచిపారిపోయాడు. ప్రజ్వల్‌ను తిరిగి ఇండియా రప్పించేందుకు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఇంటా బైట ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు సిట్ ముందు హాజరయ్యేందుకు ప్రజ్వల్ సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఇటీవల ఓ వీడియో విడుదల చేసి.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఈ నెల 31వ తేదీన ఇండియాకు వచ్చి సిట్ ఎదుట హాజరవుతానని తెలిపాడు. దీంతో ప్రజ్వల్ ఇండియాకు రాగానే అరెస్ట్ చేసేందుకు కర్నాటక పోలీసులు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే, లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ప్రజ్వల్ రేవణ్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బెంగళూరు సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజ్వల్ ప్రస్తుతం విదేశాల్లో పరారీలో ఉండటంతో అతడి తరుఫున లాయర్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.