Derail in Ratlam: మధ్యప్రదేశ్ లో పట్టాలు తప్పిన రైలు

by Shamantha N |

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌ లోని రత్లామ్‌లో గూడ్ రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఢిల్లీ – ముంబై మార్గంలో రైల్వే యార్డు సమీపంలో పెట్రోలియం ఉత్పత్తులతో గూడ్స్ రైలు వెళ్తుంది. కాగా.. గురువారం అర్ధరాతి గూడ్స్ రైలు బోగీలు తప్పింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించి రత్లామ్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాగన్ నుండి పెట్రోలియం లీక్ అవుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

రైళ్ల రైకపోకల పునరుద్ధరణ

రాజ్‌కోట్‌ నుంచి భోపాల్‌ సమీపంలోని బకానియాలోని భౌరీకి గూడ్స్ రైలు వెళ్తున్నట్లు రత్లామ్ డీఆర్ఎం రజీనీష్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అప్‌లైన్‌లో వెళ్లే రైళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదని డీఆర్‌ఎం తెలిపారు. త్వరలో అప్ ట్రాక్ నుండి డౌన్ లైన్ రైళ్లను నడపడం ప్రారంభిస్తామన్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం రెండు రైళ్లు మాత్రమే నిలిచిపోయాయని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. ఏ రైలును రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. కొన్ని రైళ్లు మాత్రం కాస్త ఆలస్యం కావచ్చని తెలిపారు. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story

Most Viewed