19 Dead as Heavy Rains : ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. ఇప్పటికే 19 మందికి పైగా మృతి

by GSrikanth |   ( Updated:2023-07-10 15:02:26.0  )
19 Dead as Heavy Rains : ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. ఇప్పటికే 19 మందికి పైగా మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర భారత దేశంలో గత వారం రోజులుగా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఇంకా వర్షాల ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉత్తరాది వారదల కారణంగా 19 మందికి పైగా మ‌ృతి చేందినట్లు సమాచారం. ఉత్తరాదిన ప్రవహించే బియాస్, చీనాబ్, యమున నదుల్లో ప్రవాహం పెరుగుతుంది. ఈ నదుల ప్రహహం వల్ల పలు బ్రిడ్జిలు కూలిపోయాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇంకా వరద ఉదృతం కొనసాగుతునే ఉంది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. పలు గ్రామాలను ప్రభుత్వాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఖాళీ చేయించారు. హిమాచల్ ప్రదేశ్ తునాగ్ పట్టణాన్ని వరద బురదతో ముంచెత్తింది.

కొండపై నుంచి బండరాళ్లు, చెట్లు తునాగ్ కాలనీల్లోకి కొట్టుకొచ్చి బీభత్సం సృష్టించాయి. అపట్టికే ఆ పట్టణాన్ని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం జరగలేదు. డెహ్రాడూన్ సమీపంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న నేడు బస్సు చిక్కుకుపోయింది. కిటికీల నుంచి పైకెక్కి తమ ప్రాణాలు ప్రయాణికులు కాపాడుకున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్‌లో నీటి ఎద్దడి కారణంగా రాకపోకలను సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి అతిషి మాట్లాడుతూ.. మా లెక్కల ప్రకారం, రేపు ఉదయం నాటికి, యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటే అవకాశం ఉందన్నారు. పాత యమునా రైల్వే బ్రిడ్జి వద్ద నది ప్రమాద స్థాయిని దాటుతుందని తెలిపారు. వరద మైదానాలలో నివసించే ప్రజలను ఖాళీ చేయిస్తున్నామని అందరిని అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story