- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MONKEY FEVER: కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న ‘మంకీ ఫీవర్’.. భయం గుప్పిట్లో కర్ణాటక ప్రజలు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సృష్టించిన కల్లోలంతో కుటుంబంలోని తమ వాళ్లను పొగొట్టుకుని నిత్యం వారి జ్ఞాపకాలతో జనం కాలం వెల్లదీస్తున్నారు. అదేవిధంగా కేరళలో పుట్టిన నిఫా వైరస్ చాపకింద నీరులా వ్యాపించి చాలా మంది ప్రణాలను బలి తీసుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటకలో మరో వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ‘మంకీ ఫీవర్’ చాపకింద నీరులా వ్యాపిస్తూ.. గ్రామల నుంచి మొదలై పట్టణాలకు కూడా వ్యాపిస్తోంది. ఈ వ్యాధితో రాష్ట్రంలో తాజాగా మరొకరు మృతి చెందారు. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్ తాలూకా, కూర్లకై గ్రామానికి చెందిన ఓ మహిళ (60) మంకీ ఫీవర్‌తో 20 రోజుల పాటు పోరాడి చివరకు ప్రాణాలు వదిలారు. దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది.
ఈ నేపథ్యంలోనే మంకీ ఫీవర్ కేసుల పెరుగుదలపై కర్ణాటక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 100 దాటింది. మరోవైపు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మంకీ ఫీవర్ కేసుల కట్టడికి చర్యలు చేపడుతోంది. ఇటీవలే ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఐసీఎంఆర్ అధికారులతో కర్ణాటక ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. రోగులకు వ్యాక్సినేషన్ చేపట్టేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నారు.