- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kharge : విపక్ష ఎమ్మెల్యేలను మోడీ మేకల్లా చూస్తారు : ఖర్గే
దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Modi) ఎమ్మెల్యేలను మేకల్లా కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Kharge) ఆరోపించారు. ‘‘విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను(MLAs) మేకల్లా కొనేసి మోడీ మేపుతున్నారు. అవసరం తీరిపోయాక.. తగిన టైం వచ్చినప్పుడు ఆ మేకలను అన్నింటిని తినేస్తారు’’ అని ఆయన ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీలతో చేతులు కలిపి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఖర్గే విమర్శించారు.
‘‘కాంగ్రెస్ పార్టీకి ఘన చరిత్ర ఉంది. మేం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లం. జీవితాలను త్యాగం చేసిన వాళ్లం. మోడీ, అమిత్ షా పంపే ఈడీ, సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడం’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఖరి సరిగ్గా లేదు. ఆయన నిజమైన యోగి కాదు. నోటిలో రామనామం.. చంకలో కత్తి అన్నట్టుగా యోగి వ్యవహార శైలి ఉంది’’ అని ఖర్గే దుయ్యబట్టారు. ‘‘విడిపోతే వినాశనం తప్పదని హిందువులతో సీఎం యోగి అంటున్నారు. అది యోగులు మాట్లాడే భాష కాదు.. తీవ్రవాదులు మాట్లాడే భాష. రాజీవ్ గాంధీ హంతకురాలిని సోనియా గాంధీ క్షమించారు. ప్రియాంకా గాంధీ ఆ హంతకురాలిని కౌగిలించుకున్నారు. ప్రేమ, దయ, జాలి అంటే అది’’ అని కాంగ్రెస్ చీఫ్ హితవు పలికారు.