- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను బహిరంగంగానే లాక్కుంటున్నారు: రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు బదులుగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం ద్వారా నరేంద్ర మోడీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని ముఖ్యమైన పోస్టుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్‌మెంట్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను బహిరంగంగానే లాక్కుంటున్నారని అత్యున్నత బ్యూరోక్రసీ తో సహా దేశంలోని అన్ని ఉన్నత స్థానాల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేదని..ఈ విషయం నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాన్నారు. ఈ లేటరల్ ఎంట్రీ విధానం.. UPSCకి సిద్ధమవుతున్న ప్రతిభావంతులైన యువత హక్కులను దోచుకోవడం, అణగారిన వారికి రిజర్వేషన్‌తో సహా సామాజిక న్యాయం భావనపై దాడి చేయడమే అన్నారు. పరిపాలనా నిర్మాణం, సామాజిక న్యాయం రెండింటినీ దెబ్బతీసే ఈ దేశ వ్యతిరేక చర్యను భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.