మోడీ గోబెల్స్ నుంచి స్ఫూర్తి పొందారు: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు

by samatah |
మోడీ గోబెల్స్ నుంచి స్ఫూర్తి పొందారు: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. నాజీ రాజకీయ వేత్త అయిన జోసెఫ్ గోబెల్స్‌ను ప్రధాని మోడీ స్ఫూర్తిగా తీసుకున్నారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మీకు ఒక అబద్దాన్ని చెప్పి దానిని పునరావృతం చేస్తూ ఉంటే..చివరికి ప్రజలు దానిని విశ్వసిస్తారని గోబెల్స్ వ్యాఖ్యానించేవారు. కాబట్టి రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మోడీ ఖచ్చితంగా గోబెల్స్ ప్రచార విలువను చదివి ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఉంటాడు. అందుకే అంతటా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

‘తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే మోడీ ఓ మాజీ ప్రధానిపై, కాంగ్రెస్ న్యాయ పత్రమై సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పారు’ అని తెలిపారు. అసత్యమేవ జయతే అనేది ఎల్లప్పుడూ మోడీ నినాదం అని ఆరోపించారు. ఆయన మాట్లాడుతున్న మాటలే దీనిని పదేపదే రుజువు చేశాయని వెల్లడించారు. ఆయన మాట్లాడిన ప్రతిసారీ సత్యం కనుమరుగవుతుందని స్పష్టం చేశారు. కానీ మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story