- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంకీర్ణ ప్రభుత్వాన్ని మోడీ నడపలేరు: శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించిన ఇండియా కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపలేరని తెలిపారు. బీజేపీకి మెజారిటీ లేదని పొత్తు పెట్టుకోవడానికి మాత్రమే ప్రయ్నత్నిస్తోందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయేలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు సంకీర్ణంలో ఉండే అవకాశం ఉందని, కానీ వారు ప్రస్తుతం కొత్త డిమాండ్లను ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. వారి డిమాండ్లను మోడీ పరిష్కరించపోతే కూటమి నుంచి వైదొలగే చాన్స్ ఉందన్నారు. చంద్రబాబు, నితీశ్‌లు అందరికీ మిత్రులే..కానీ వారు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు తెచ్చే వాళ్లకు మద్దతు ఇస్తారని అనుకోవడం లేదన్నారు. కాగా, ఢిల్లీలో ఇండియా, ఎన్డీయే కూటమిల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే సంజయ్ రౌత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.