మోడీ 3.0కు నెల రోజులు పూర్తి..ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

by vinod kumar |
మోడీ 3.0కు నెల రోజులు పూర్తి..ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడి మంగళవారం నాటికి నెల రోజులు పూర్తైంది. ఈ నేపథ్యంలో మోడీ 3.0 పాలనపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఈ టైంలో దేశ వ్యాప్తంగా జరిగిన 10 కీలక ఘటనలను వివరిస్తూ మండిపడింది. కశ్మీర్ ఉగ్రదాడులు సహా పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. నెల రోజుల మోడీ పాలనలో పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం, కశ్మీర్ ఉగ్రదాడుల్లో జవాన్ల మృతి, నీట్ యూజీ పేపర్ లీక్, నీట్ పీజీ రద్దు, యూజీసీ నెట్ పేపర్ లీక్, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ రద్ద అయ్యాయని తెలిపింది.

అలాగే పాలు, పప్పులు, కూరగాయలు, గ్యాస్, టోల్ అన్నీ ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొంది. రికార్డు స్థాయిలో రూపాయి పతనం, ఎనిమిది నెలల రికార్డు స్థాయికి చేరిన నిరుద్యోగం, టోకు ద్రవ్యోల్బణం 15 నెలల రికార్డును అధిగమించిందని వెల్లడించింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సూచించింది. కాగా, జూన్ 9న మోడీ భారత ప్రధానిగా వరుసగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story