- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ ఆఫర్‌పై శరత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్‌సీపీ (నేషనల్ కాంగ్రెస్ పార్టీ) పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు మోడీ ఇచ్చిన ఆఫర్ చిన్న పిల్లలను కన్విన్స్ చేసేందుకు చేస్తున్న చర్యల్లా ఉన్నాయని శరత్ పవార్ అన్నారు. అయితే ఇటీవల వేదాంత గ్రూప్ ప్రాజెక్ట్ మహారాష్ట్రను కాదని గుజరాత్‌ను ఎంచుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మరికొన్నాళ్లు ఆగితే మహారాష్ట్ర రాష్ట్రాన్ని కూడా మోడీ గుజరాత్‌కు ఇచ్చేస్తారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రకు ఇంకా పెద్ద ప్రాజెక్స్ ఇస్తానని కేంద్రం ప్రామిస్ చేయడం చిన్నపిల్లలను కన్విన్స్ చేయడంలా ఉందని ఆయన అన్నారు.
'వేదాంత ప్రాజెక్ట్ రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిపోయింది కాబట్టి దాన్ని తిరిగి తీసుకురావడం కుదరదు. దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. కానీ రానున్న ప్రాజెక్ట్‌ల కోసం మాత్రం పెట్టుబడిదారులకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తగిన వాతావరణం ఏర్పరచాలి' అని శరత్ పవార్ అన్నారు. అంతేకాకుండా 'ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో భేటి అయ్యారని విన్నాను. అందులో మోడీ మహారాష్ట్రను ఇంకా పెద్ద ప్రాజెక్ట్‌లు రావడానికి సహాయపడతానని హామీ ఇచ్చారని కూడా విన్నాను. కానీ మోడీ హామీ చిన్న పిల్లను కన్విన్స్ చేయడానికి చేస్తున్న చర్యల్లా ఉంది' అని ఆయన అన్నారు.