Manipur: మణిపూర్‌లోని తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు

by S Gopi |
Manipur: మణిపూర్‌లోని తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ ప్రభుత్వం ఆదివారం రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని డిసెంబర్ 3 వరకు పొడిగించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్, తౌబల్, చురచంద్‌పూర్, కాంగ్‌పోకపి, ఫెర్జాల్, జిరిబామ్‌లలో నిషేధాన్ని పొడిగించినట్లు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 'ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితిని, సాధారణ ఆపరేషన్‌తో ఇంటర్నెట్ సేవలకున్న పరస్పర అవసరాన్ని సమీక్షించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల్లో వీశాట్,వీపీఎన్ సేవలతో సహా మొబైల్ ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేయడాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మణిపూర్, అస్సాంలోని జిరి, బరాక్ నదులలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లల మృతదేహాలను వెలికితీసిన తరువాత రాష్ట్రంలో హింస చెలరేగిది. దాంతో నవంబర్ 16 నుంచి ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. సామాన్య ప్రజలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని మణిపూర్ ప్రభుత్వం నవంబర్ 19న బ్రాడ్‌బ్యాండ్ సేవలపై నిషేధాన్ని షరతులతో ఎత్తివేసింది. అయితే, అనుమతులు ఉన్న సబ్‌స్క్రైబర్‌లు తప్ప మరే ఇతర కనెక్షన్‌ను అంగీకరించకూడదని, వైఫై లేదా హాట్‌స్పాట్‌లను అనుమతించకూడదని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

Next Story