- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ఇలా కూడా పాటిస్తారా..?! అవాక్కవ్వాల్సిందే!!
దిశ, వెబ్‌డెస్క్ః ప్రపంచంలో ఏ దేశమైనా ఇండియా రోడ్లపైన ట్రాఫిక్ సెన్స్ చూసి అవాక్కవ్వాల్సిందే! ఇష్టారాజ్యంగా రోడుదాటే జనాలు, ఖాళీ దొరికితే దూసుకుపోయే వాహనాలు... ఇక, ఇక్కడ ఫుట్‌పాత్‌లు కూడా బైకర్లకు షార్ట్‌కట్‌లే. సిటీలో గమ్యాన్ని చేరాలంటే నరకాన్ని దాటుకొచ్చినంత సంబరపడిపోతుంటారు చాలా మంది. అయితే, ఇదే ఇండియాలో ఒక రాష్ట్రం మాత్రం తూచా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్‌ని పాటిస్తోంది. ఇంచ్ కూడా దాటకుండా ఇంగితాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే, ఆనంద్ మహీంద్రా కూడా దీన్ని చూసి నివ్వెరపోయాడు. అవాక్కయ్యి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ కూడా చేశాడు.
ఇండియాలో కనిపించే ఇలాంటి అరుదైన ట్రాఫిక్ ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా కూడా దీన్ని ఇటీవల పోస్ట్ చేసి, ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'ఇండియాలో మన జీవిత నాణ్యతను మనమే మెరుగుపరుచుకోవాలి. ఈ చిత్రం చాలా స్ఫూర్తిని అందిస్తోంది' అంటూ సంబరపడ్డారు. ఈ చిత్రాన్ని మొదట సందీప్ అహ్లావత్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా, ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. భారత ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మిజోరాం రాష్ట్రంలో ట్రాఫిక్ ఇది. అక్కడ ఒక రోడ్డులో ట్రాఫిక్‌ను ఇలా మచ్చుకు చూపించారు. ఇక్కడ, ఏ ఒక్కరూ ఎదుటి వాహనాన్ని దాటుకొని వెళ్లడానికి ఏ మాత్రం ప్రయత్నించరు. అంతకుమించి, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ గీతను కించింతైనా క్రాస్ చేయరు. మరి ఇలాంటి దృశ్యం ఇండియాలో అద్భుతమే కాదా..?! అందుకే, ఇంత ఫాలోయింగ్ వచ్చింది.
What a terrific pic; Not even one vehicle straying over the road marker. Inspirational, with a strong message: it's up to US to improve the quality of our lives. Play by the rules… A big shoutout to Mizoram. 👏🏼👏🏼👏🏼 https://t.co/kVu4AbEYq8
— anand mahindra (@anandmahindra) March 1, 2022