- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Modi పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో : రాజ్యాంగాన్ని రక్షించాలని, ప్రధాని మోడీని చంపడానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మాజీ మంత్రి పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు దామోహ్ జిల్లా హట్టాలోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్ర ఆదేశాల మేరకు పన్నా జిల్లాలోని పవయీ పోలీస్ స్టేషన్‌లో పటేరియాపై కేసు నమోదైంది.
కాగా, ఓ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి 'రాజ్యాంగాన్ని, మైనార్టీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని చంపేందుకు సిద్ధం కావాలి. చంపడం అంటే ఆయనను ఓడించడమని అర్థం' అని పటేరియా అన్నట్లు సోమవారం ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే తన వ్యాఖ్యలపై రాజా పటేరియా వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రధానిని ఓడించాలనే ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. అయితే దీనిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని సోమవారం పేర్కొన్నారు. అది ఫ్లోలో జరిగిపోయింది.. అయితే కేవలం ఈ వ్యాఖ్యలను మాత్రమే హైలెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Read More....