- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తిరుగుబాటుకు ఛాన్సే లేదు.. మా ఎమ్మెల్యేల్లో యూనిటీ ఉంది’
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ రాజకీయం దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రతీ గంటకో కీలక మలుపు తీసుకుంటూ ఉత్కంఠతకు దారితీస్తోంది. తాజాగా.. ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతోనే ఈ రోజు సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ కూటమికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేయడం సులభంగా మారింది. అయితే, అనూహ్యంగా కొందరు తిరుగుబాటు చేస్తారని.. దానిని కూటమి తట్టుకోలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా.. ఈ ఆరోపణలను మంత్రి ఆలంగీర్ ఆలం తోసి పుచ్చారు. తమ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. మరి బలపరీక్షలో ఏం జరుగుతుందో చూడాలి.