అమిత్ షాతో భేటీ.. బీజేపీలోకి గాలి జనార్ధన్ రెడ్డి..?

by GSrikanth |
అమిత్ షాతో భేటీ.. బీజేపీలోకి గాలి జనార్ధన్ రెడ్డి..?
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. 2022లో బీజేపీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్న గాలి.. మరోసారి బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిశానని భేటీ అనంతరం పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక్కసారిగా ఆయన బీజేపీ పెద్దల వద్దకు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మొన్న కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ గుర్తు మీద పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేసి.. లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి చేరితే బీజేపీకి కర్ణాటకలో కాస్త బలం పెరుగుతుందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story