Milind Deora: ఉద్ధవ్ థాక్రేను కాంగ్రెస్ ఎప్పటికీ సీఎంను చేయదు.. శివసేన నేత మిలింద్ డియోరా

by vinod kumar |
Milind Deora: ఉద్ధవ్ థాక్రేను కాంగ్రెస్ ఎప్పటికీ సీఎంను చేయదు.. శివసేన నేత మిలింద్ డియోరా
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేను కాంగ్రెస్ ఎప్పటికీ సీఎంను చేయబోదని షిండే శివసేన ఎంపీ మిలింద్ డియోరా అన్నారు. సీఎం కావాలనే ఉద్ధవ్ కల కలగానే మిగిలిపోతుందని తెలిపారు. శనివారం ఆయన ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఉద్థవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కాంగ్రెస్ మద్దతివ్వబోదని జోస్యం చెప్పారు. హస్తం పార్టీ పనితీరును నిశితంగా గమనించానని తెలిపారు. ఉద్ధవ్ థాక్రే సీఎం కావాలనే ఆశతో, ఎంవీఏకు వెళ్ళారు, కానీ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యల తర్వాత ఎన్నిటికీ ఉద్ధవ్ సీఎం కాబోడని స్పష్టమైందన్నారు. అధికార మహాయుతి కూటమిలో సీఎం అభ్యర్థిత్వంపై ఎలాంటి గందరగోళం లేదని అతి త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ) ఎంపిక చేసిన అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఉద్ధవ్ థాక్రే వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story