Mike Tyson: మైక్ టైసన్‌కు షాక్.. యూట్యూబర్ చేతిలో ఓటమి

by vinod kumar |
Mike Tyson: మైక్ టైసన్‌కు షాక్.. యూట్యూబర్ చేతిలో ఓటమి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోని గొప్ప బాక్సర్లలో ఒకరైన మైక్ టైసన్‌ (mike Tyson)కు షాక్ తగిలింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ప్రొఫెషనల్ ఫైట్‌లోకి తిరిగి వచ్చిన ఆయన 27 ఏళ్ల యూ ట్యూబర్ జేక్ పాల్‌ (Jake paul)తో జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు. మైక్ టైసన్, యువ బాక్సర్ జేక్ పాల్ మధ్య టెక్సాస్‌లోని అర్లింగ్టన్ ఏటీ అండ్ టీ (AT&T) స్టేడియంలో శనివారం బాక్సింగ్ పోరు జరిగింది. టైసన్ మొదటి రెండు రౌండ్లలో ఆధిపత్యం చెలాయించాడు. ఒక్కో రౌండ్ రెండు నిమిషాల పాటు సాగింది. మొదటి రౌండ్‌లో ఎంపైర్ పాల్‌కు తొమ్మిది పాయింట్లు, టైసన్‌కు 10 పాయింట్లు ఇచ్చారు. రెండో రౌండ్‌లోనూ ఇద్దరికి ఇవే పాయింట్లు ఇచ్చారు. అయితే దీని తర్వాత మూడు నుంచి ఎనిమిదో రౌండ్ వరకు పాల్‌కు10-10 పాయింట్లు ఇవ్వగా.. టైసన్‌కు తొమ్మిది పాయింట్లు ఇచ్చారు. దీంతో పాల్ 78, టైసన్ 74 పాయింట్లు సాధించారు. అయితే ఓడిపోయినప్పటికీ 58 ఏళ్ల టైసన్ ఎనిమిది రౌండ్ల పాటు స్థిరంగా నిలిచి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. పోరు జరుగుతున్నంత సేపు అభిమానులను అలరించడానికి ఇద్దరూ శాయశక్తులా ప్రయత్నించారు. మొదటి రెండు రౌండ్ల తర్వాత టైసన్ అలసిపోయినట్లు కనిపించినా.. చివరి రౌండ్ వరకు నిలవడం యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. మ్యాచ్ అనంతరం టైసన్ కూడా పాల్‌ను అభినందించి హగ్ చేసుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా హుషారయ్యారు. కాగా, టైసన్ గతంలో 2005లో తన చివరి ప్రొఫెషనల్ ఫైట్ ఆడాడు, అందులో అతను ఐరిష్‌కు చెందిన కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Next Story