Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక లోపం.. 10 బ్యాంకులపై ప్రభావం

by Shiva |
Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక లోపం.. 10 బ్యాంకులపై ప్రభావం
X

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్‌ విండోస్ సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వరల్డ్ వైడ్‌గా బ్యాంకింగ్ సేవలుకు బ్రేకులు పడ్డాయి. అదేవిధంగా పలు రకాల విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో భారతదేశంలోని 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటనను సైతం విడుదల చేసింది. ముందు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడినప్పటీ అందులో కొన్ని సమస్యలను తాత్కలికంగా బాగు చేశారు. ముఖ్యంగా పేరుగాంచిన బ్యాంకులు అన్ని క్లౌడ్‌ బేస్‌తో పని చేసేవి కావని ఆర్బీఐ తెలిపింది. కొన్ని బ్యాంకులు మాత్రమే క్లౌడ్ బేస్‌ సేవలను ఉపయోగిస్తున్నాయని పేర్కొంది.

Advertisement

Next Story