స్కర్టులు ధరించిన మగాళ్లు.. వీడియో వైరల్..

by Anjali |
స్కర్టులు ధరించిన మగాళ్లు.. వీడియో వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో యూత్ సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎక్కడ పడితే అక్కడ.. వింత చేష్టలతో ఏ వీడియో పడితే ఆ వీడియోలు అప్‌లోడ్ చేయడం మనం చూస్తునే ఉన్నాం. తాజాగా.. మెట్రోలో సమీర్‌, భవ్యకుమార్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు లాంగ్ డెనిమ్ స్కర్ట్ వేసుకుని మెట్రో రైలు ఎక్కి అందరిని అశ్చర్యపరిచారు. అలాగే వారిద్దరు ఏమాత్రం షేమ్‌గా ఫీల్ అవ్వకుండా ఫోటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు.

అక్కడే ఉన్న జనాలు వీరిని చూసి తెగ నవ్వుకుంటూ.. ఇదేం స్టైల్‌రా బాబు అంటూ కొందరు, లుంగీ పర్వాలేదు కానీ ఆ స్కర్ట్స్ ఎంటీ బ్రో, అస్సలు మీ కాన్సెప్టు ఎంటో అస్సలు సమజ్ కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరెమో ‘‘ సూపర్ బ్రో, చాలా కంఫార్ట్‌గా ఉంటుంది, అందరూ ఈ విధంగా ఎందుకు ధరించకూడదు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘సమీర్, భవకుమార్ స్కర్ట్స్‌తో మెట్రో ప్రయాణం’ అని వీడియోలోని టెక్స్ట్ రాసి ఉంది. ప్రస్తుతం ఈ వీడియోకు 7లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్‌గా మారింది.


Advertisement

Next Story